రేపటి నుంచి 5 రోజులు బ్యాంకుల బంద్…

వచ్చే వారమంతా శెలవులతో, సమ్మెలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించబోతున్నాయి. 

డిసెంబర్ 21 నుంచి 26 మధ్య ఈ పరిస్థితి ఉంటుంది. డిసెంబర్ 21  ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబివొసి)పిలుపు మేరకు సమ్మె జరుగుతున్నది. బ్యాంక్ ఆఫీసర్లు 11 వ దైపాక్షిక వేతన సవరణ ఒప్పందాన్ని బేషరతుగా అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆమరుసటి రోజు నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు శెలవు. తర్వాత ఎలాగు అదివారం. సోమవారం ఒక్కటే దిక్కు.  ఇక మంగళవారం క్రిస్ట్ మస్ పర్వదినం కాబట్టి పబ్లిక్ హాలిడే. ఇక బుధవారం మరొక సమ్మె ఉంది.వేతన సవరణ కోరుతూ యునైటెడ్ ఫోరఫ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బుధవారం సమ్మె జరుగుతున్నది. శుక్రవారం నాటి సమ్మెకు కనీసం మూడు లక్ష లమంది మద్దతు తెలిపి విధులను బ హిష్కరిస్తున్నారని యూనియన్లు ప్రకటించాయి. ఈ సమ్మెకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కూడా మద్దతు తెలపడంతో  స్టేట్ బ్యాంక్ కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎటిఎంలకు  అదనపు క్యాష్ అందుబాటులో ఉంచుతున్నారు