తమిళనాడులో దారుణం.. భర్త లేడని వివాహితను చెట్టుకు కట్టేసిన కీచకులు…. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా భర్త తోడు లేని మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇటీవల తమిళనాడులో భర్త మరణించిన మహిళ పట్ల కొందరు దుర్మార్గులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. బట్ట మరణించడంతో నాలుగు ఇళ్లల్లో పని చేసుకుని పిల్లలను పోషించుకుంటున్న మహిళకు స్థానికంగా ఉండే వ్యక్తుల నుండి వేధింపులు ఎదురయ్యాయి. ఆమె ఎదురు తిరగటంతో దారుణంగా ఆమెను స్తంభానికి కట్టేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

వివరాలలోకి వెళితే…తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అరుమణై ప్రాంతంలో కళ అనే మహిళా తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుంది. అయితే భర్త మరణించడంతో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తుల నుండి ఆమెకు సమస్యలు ఎదురవుతున్నాయి. గురువారం కూడా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆమెకు ఆ నీచుల నుంచి వెకిలి మాటలు, చేష్టలు ఎదురయ్యాయి. భరించలేకపోయిన ఆమె నేరుగా వాళ్ల వద్దకు వెళ్లింది. ఇదేంటని ప్రశ్నించింది. దీంతో ఒంటరిగా ఉన్న ఆమెను ఆ దుర్మార్గులు సమీపంలో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

దీంతో ఆమె సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశి(45), జయకాంత్(37), వినోద్(44) అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.