ఐష్.. పాత సంగతే కొత్తగా తెరపైకి
అంబానీతో ఐశ్వర్యారాయ్ డేటింగ్ చేసిందా? ప్రస్తుతం మరోసారి ఈ థ్రోబ్యాక్ మ్యాటర్ నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్యారాయ్ కెరీర్ మాంచి స్వింగులో ఉండగా పలువురు హీరోలతో ప్రేమాయణాలు సాగించడం వాటిపై ఆసక్తికర కథనాలు వెలువడడం తెలిసిందే.
కెరీర్ ఆరంభమే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిన ఐశ్వర్యారాయ్ అతడి తో ఓ వివాదం కారణంగా తెగతెంపులు చేసుకుంది. సల్మాన్ తిట్టి కొట్టాడని కథనాలొచ్చాయి. ఆ తర్వాత వివేక్ ఒబేరాయ్ తో ఎఫైర్ కూడా సల్మాన్ నుంచి విడిపోవడానికి కారణమని ఒబేరాయ్ కెరీర్ కి చెక్ పెట్టేందుకు సల్మాన్ కుట్రలు చేశాడని ప్రచారమైంది. సల్మాన్ కంటే ముందే తన వ్యక్తిగత డిజైనర్ తోనూ ఐష్ ఎఫైర్ సాగించిందన్న ప్రచారం ఉంది.
ఇక ఐష్ పెద్ద సూపర్ స్టార్ అయ్యాక వాణిజ్య ప్రకటనలతో బిజీబిజీగా ఉండేది. ఆ క్రమంలోనే అంబానీల ప్రకటనలకు తాను ప్రచారం చేసేది. ఆ క్రమంలోనే అనీల్ అంబానీతో స్నేహం కాస్తా డేటింగ్ వరకూ వెళ్లిందని .. అనీల్ అంబానీతో భారీ డీల్ కుదుర్చుకున్న ఐశ్వర్యారాయ్ అందుకు వెనకాడలేదని ప్రచారమైంది. అయితే అంబానీ ఫ్యామిలీతో ఓ పెళ్లిలో ఐష్ ఒకే టేబుల్ వద్ద కూచుని పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీసి వైరల్ చేయడంతో ఆ ప్రచారం తెరపైకొచ్చింది. అయితే ఈ ఎఫైర్ మ్యాటర్స్ అన్నిటినీ ఆ తర్వాత ఐష్ కొట్టి పారేసింది. ప్రస్తుతం ఐష్ బచ్చన్ ఇంట కోడలు. అభిషేక్ భార్య. ఆరాధ్యకు తల్లిగా ప్రపంచానికి సుపరిచితం.