కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది అయిన అమృత్ పాల్ సింగ్… ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. భారతదేశంలో ఒక వ్యక్తిని అరెస్టు చేయడం పోలీసులకు ఇంత పెద్ద సమస్యా అనే సందేహం రేకెత్తించిన వ్యక్తి. సినిమా స్టైల్ లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్న ఈ సింగ్… పాకిస్తాన్ ఐఎస్‌ఐ తో కూడా సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. ఇదంతా ఒక యాంగిల్ అయితే… ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. పైకి కరుడుగట్టినవాడే కానీ కళాకారుడే అనుకోవడం పక్కా!
అవును… పైకి పెద్ద పోరాట యోధుడిగా కనిపించే అమృత్‌పాల్ సింగ్ కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో అక్రమ సంబంధాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో అనేక మంది మహిళలతో ఇతగాడు చేసిన చాటింగ్ మాములుగా లేదంట. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్ లు, ఈమోజోలు లతోపాటు… ఆ అసభ్య వీడియో కాల్స్ ని రికార్డు చేసిన చరిత్ర కూడా ఇతగాడి సొంతమట. అలా రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం కూడా మరోడి పోరాటంలో ఒక భాగం అని అంటున్నారు.
తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్ షిప్ మాత్రమే కావాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ సీరియస్ రిలేషన్ షిప్ వద్దని.. అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్ లో చెప్పడం… అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకోవడం ఇతడి యవ్వారాలకు మరొక ఉదాహరణలు. ఇక ఇన్ స్టా గ్రాం ఖాతాలో కూడా మనోడి కథలు మామూలుగా లేవని.. అనేక మంది అమ్మాయిలకు ఒకేసమయంలో అతడు మెసేజ్‌లు పంపాడని.. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో చెప్పడం.. దుబాయ్ లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేయడం వంటివి మచ్చుకు కొన్ని మాత్రమే!
ఇతగాడి తెరవెనుక బాగోతాలు ఇలా ఉంటే… మరోవైపు పంజాబ్ పోలీసులు ఈ అమృత్ పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తునే ఉన్నారు. దాదాపు ప్రతీ రహదారినీ, ప్రతీ వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. కానీ, అతను మాత్రం సినిమా స్టైల్ లో పోలీసుల కళ్లుగప్పి వేషాలు మారుస్తూ – వాహనాలు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక తాజాగా ఓ బండిపై వెళ్తున్న అతడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయినా కూడా అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మరి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కం హర్రర్ ఎపీసోడ్ కి తెరపడాలంటే… వీలైనంత తొందర్లో ఈ సింగ్ ని పోలీసులు పట్టుకుని లోపల వేయాలన్నమాట!