“జాతీయగీతం వినబడితే ఆ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా”? వైరల్ వీడియో

విద్యాలయాల్లో ప్రతిరోజు జాతీయగీతాన్ని ఆలపిస్తారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఏడాదిలో రెండు, మూడు సార్లు తప్ప జాతీయగీతం గురించి మనం పెద్దగా పట్టించుకోము. అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలోనే. అసలు చదువుకోని వారికి దీని గురించి పెద్దగా తెలియదు కూడా.

ఈ మధ్య సినిమా థియేటర్లలో ఈ గీతాన్ని ప్రదర్శించటం, ఆ 52 సెకన్లు నిలబడటం తప్పనిసరి చేశారనుకోండి. కొంతమంది మహానుభావులు దీని మీద కూడా విమర్శలు చేసిన దాఖలాలు ఉన్నాయ్. “డీమానిటైజేషన్ అని ఏటీఎంల వద్ద నిలబెట్టారు, ఇప్పుడు థియేటర్లలో నిలబడమంటున్నారు, ఎన్నిసార్లు నిలబడాలి”? అని ప్రశ్నించిన ఉత్తములు కూడా ఉన్న దేశం మనది. అలాంటిది ఒక ఊరు మాత్రం జాతీయగీతంపై తమకి ఉన్న గౌరవంతో ఆదర్శంగా నిలుస్తుంది.

తెలంగాణలోని జమ్మికుంట అనే పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఉదయం ఆ పట్టణంలో 16 లౌడ్ స్పీకర్లతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ఆ సమయంలో ఊరిలోని ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో సహా ఎక్కడివారక్కడే నిలబడి సెల్యూట్ చేస్తూ ఆ గీతాన్ని ఆలపిస్తారు. హైదరాబాద్ నుండి సరిగా 145 కి.మీ. దూరంలో ఉన్న ఈ వూరు అందరికి ఆదర్శప్రాయం అంటున్నారు ఇది తెలిసినవారంతా. కింద ఉన్న వీడియోలో ఆ దృశ్యాల్ని మీరు కూడా చూడవచ్చు. మనం ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటాం కానీ ఇలాంటివి ప్రతి ఇండియన్ చూడాల్సిన వీడియోలు. తప్పక షేర్ చేయండి.