బెంగళూరులో వింత ఘటన.. సెల్ టవర్ ఎత్తుకెళ్లిన దుండగులు..!

సాధారణంగా ఇళ్లల్లో దుకాణాలలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈమధ్య కాలంలో జెసిబి లు, రైలుబోగీలు ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల బెంగళూరులో ఒక వింత దొంగతనం జరిగింది. కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం కొందరు వ్యక్తులు ఏకంగా సెల్ ఫోన్ టవర్ ని మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 17 లక్షల రూపాయల విలువ చేసే సెల్ టవర్ మాయమవటంతో ఆ సెల్ టవర్ యాజమాన్యం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలలోకి వెళితే…బెంగుళూరు మహాదేవపురాలోని గోశాల రోడ్ ప్రాంతంలో గత కొన్నేళ్ల నుంచి ఓ సెల్ టవర్ ఉండేది. అయితే కష్టపడకుండా కష్టపడకుండా డబ్బులు సంపాదించడం కోసం అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ సెల్ టవర్ పై కన్నేశారు. ఈ క్రమంలోనే ఆ దొంగలు గోశాల రోడ్ లో ఉన్న సెల్ టవర్ ను ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే కొంతమంది వ్యక్తులు కలిసి పక్లా ప్లాన్ తో ఎంతో శ్రమించి అక్కడున్న ఆ సెల్ టవర్ ను దెంగలించటానికి రోజుకొక పార్ట్ విప్పారు. అలా నెల రోజుల పాటు సెల్ టవర్ లోని ఒక్కో పార్ట్ విప్పి 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువు కలిగిన ఆ సెల్ టవర్ ను దొంగిలించారు.

అయితే సెల్ టవర్ దొంగతనం గురించి ఆలస్యంగా తెలుసుకున్న కంపెనీ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.17 లక్షల విలువ కలిగిన సెల్ టవర్ ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కంపెనీ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. అయితే సెల్ టవర్ దొంగతనం గురించి తెలుసుకున్న స్థానికులు అవాక్కవుతున్నారు.