నల్లగొండ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను బిసిలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కనగల్ మండల కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు టవర్ పైకి వస్తే కిందకు దూకి చనిపోతానని బెదిరించాడు. దీంతో పోలీసులు ఏం చేయలేక బతిలాడుతన్నారు. విజయ్ సెల్ టవర్ ఎక్కిన వీడియో కింద ఉంది చూడండి.
నల్లగొండలో టిఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగుతుండటంతో అక్కడికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. దీంతో నల్లగొండలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విజయ్ టవర్ ఎక్కడంతో ప్రజలు, కార్యకర్తలు అక్కడికి భారీ ఎత్తున్న చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
నల్లగొండలో భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో అతనికి ఎలా ఇస్తారని పశ్నించాడు. బిసిల జనాభా అధికంగా ఉందని అయినా కూడా టిఆర్ ఎస్ ప్రకటించిన సభ్యుల్లో 5 శాతం కూడా బిసిలు లేరని వాపోయాడు. బిసిలంటే అంత చిన్న చూపా అని విమర్శించాడు. బిసిలకు ఉన్నత పదవులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.