ఉద్యోగాలు 80, అభ్యర్థులు 8 వేలు…ప్చ్…

అసలే ప్రభుత్వ ఉద్యోగానికి పిచ్చి కాంపిటిషన్. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తాదా అని లక్షలాది మంది నిరుద్యోగులున కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. గోవాలో 80 అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. 80 పోస్టులకు 8000 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 100 మంది పోటి పడ్డారు.

దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సంవత్సరం జనవరి 7న పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో ఒక్కరంటే ఒక్కరు కూడా అర్హత సాధించలేక పోయారట. ఈ విషయాన్ని గోవా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటిపడే నిరుద్యోగులలో ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోవడంతో అక్కడి విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని విపక్షాలు అంటున్నాయి. విద్యా విధానాల్లో మార్పులు చేసి నైపుణ్య విద్యనందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరు కూడా అర్హత సాధించపోవడంతో దేశమంతా చర్చనీయాంశమైంది.