కలెక్టర్ ఆమ్రపాలికి చిన్నారి సహాయం

ఆ చిన్నారి 4వ తరగతి చదువుతుంది. కేరళలో జల విలయాన్ని చూసి ఆ చిన్నారి తల్లడిల్లింది. నిరాశ్రయులైన లక్షలాది మందికి తనకు తోచినంతగా సహాయం అందించాలనుకుంది. పెద్ద మనసుతో వాళ్ల ఆకలిని తీర్చాలనుకుంది. అందుకే 4 క్వింటాళ్ల బియ్యాన్ని వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చింది.

వరంగల్ జిల్లా కేంద్రంలోని కిందర్లాండ్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న రిదా ఆఫ్రీన్ అనే అమ్మాయి కేరళ వరద బాధితుల కోసం జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి కలెక్టరేట్ లో  4 క్వింటాళ్ల బియ్యం మరియు నిత్యావసర సరుకులు విరాళంగా అందజేశారు. చిన్న వయసులో చిన్నారి చేసిన పెద్ద సహాయానికి కలెక్టర్ ఆమ్రపాలి రిదా ఆఫ్రీన్ ను అభినందించారు.