సోషల్ మీడియాను నిషేధిస్తారా?గడ బిడ మధ్య తెరదించిన ప్రధాని!

తీగలాగితే డొంక కదిలి నట్లు ప్రధాని మోదీ చేసిన ఒక ట్వీట్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆదివారం నుండి తను సోషల్ మీడియాకు దూరంగా వుంటానని చేసిన ట్వీట్ పై పలు ఊహాగానాలు ప్రారంభమైనవి.తొలుత కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. విద్వేషాలకు దూరంగా వుంటే చాలన్నారు. కాని మరొక కాంగ్రెస్ నేత శశి థరూర్ మాత్రం ప్రధాన మంత్రి ప్రకటనలోని ఘూడార్దం గురించి ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాను నిషేధించేందుకు ఇది సూచనగా అభివర్ణించారు

గమనార్హమైన అంశమేమంటే ప్రధాన మంత్రి ట్వీట్ తర్వాత పలువురు ఆయన్ను ట్రోల్ చేశారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్ తర్వాత మరీ ఎక్కువ ట్వీట్ లు వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. సోషల్ మీడియా పరిస్థితి అయిపోయిందన్నారు.ఆ మాట కొస్తే సోషల్ మీడియాలో అత్యధికులు ఫాలో అయ్యే వారిలో ప్రధాన మంత్రి మోదీ మూడవ వారుగా ప్రచారంలో వుంది. అయితే ఇంత హఠాత్తుగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు గాని మున్ముందు గాని దేశంలో బిజెపి పాలనకు సోషల్ మీడియా సంకటంగా మారుతుందనే భయం పట్టుకొన్నదని పలువురు భావించారు. పౌరసత్వ సవరణ చట్టం ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి వెంటనే అల్లర్లు ఇందుకు ప్రేరణ కలిగినట్లు భావించారు.

వాస్తవంలో ఎప్పుడూ ప్రింట్ మీడియా పై మెడమీద కత్తి వేలాడుతూ వుంటుంది. . ఇటీవలగా ఎలక్ట్రానిక్ మీడియాపై కూడా అదుపు ఏర్పడింది. కాని సోషల్ మీడియా అనూహ్యమైన పరిధిలో విస్తరించింది. సోషల్ మీడియాలో వచ్చే చెత్తతో పాటు బూతు పురాణం అదుపు చేసే పరిస్థితి లేదు. సోషల్ మీడియా రెండు వేపుల పదును వుండే కత్తిలా వుంటుంది. మంచి జరుగుతుంది. అపకారం జరుగుతుంది. ఇతర మీడియా చెప్పులేసుకొని ఇంటి గడప దాటి అడుగు పెట్టే సరికి సోషల్ మీడియా ప్రపంచం చుట్టి వచ్చేసి ఇతర మీడియా ముందు నిలబడి దరహాసం చేస్తుంది. ఇంత హడావుడి తర్వాత ఇంతలో ప్రధాన మంత్రి కీలక ప్రకటన చేశారు.ఆదివారం మహిళా దినోత్సవం. మనల్ని ఆదర్శవంతులను చేస్తున్న మహిళలకు నా సోషల్ మీడియా అకౌంట్లు స్వాధీనం చేస్తాను. వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహ పరుస్తారు. ఆలాంటి మహిళల స్తోరీస్ SheInspireUs తో ట్యాగ్ చేయండి అని ప్రకటన చేసి తెర దించారు.