తేదీ : ఆగస్టు 09, 2019
నటీనటులు : అర్జున్, దర్శన్, నిఖిల్ గౌడ్
దర్శకత్వం : నాగన్న
నిర్మాతలు : మునిరత్నం(ఎం ఎల్ ఏ)
సంగీతం : హరికృష్ణ
స్క్రీన్ ప్లే : నాగన్న
మాటలు : వెన్నెలకంటి
తెలుగురాజ్యం.కామ్ రేటింగ్ 2.75/5
మహాభారతం లాంటి అత్యద్బత దృశ్య కావ్యాన్ని తొలిసారిగా ఇండియన్ స్క్రీన్ మీద 3డిలో నాగన్న దర్శకత్వంలో అర్జున్, దర్శన్, నిఖిల్ గౌడ్ ప్రధాన పాత్రలుగా అత్యధిక బడ్జెట్‌తో ‘కురుక్షేత్రం’ సినిమాను తెరకెక్కించాడు.
సినిమా కథ :
మహాభారతంలో దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి.. అలాగే మహాభారత ఇతివృత్తం గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా ధర్మరాజును రాజుగా ప్రతిపాదిస్తుండగా దుర్యోధనుడు (దర్శన్) .. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఆ తరువాత జరిగిన సంఘటనల అనంతరం కర్ణుడు(అర్జున్)ని దుర్యోధనుడు (దర్శన్) రాజుగా ప్రకటించి ఆప్తమిత్రుడిగా చేసుకుంటాడు. అయితే అప్పటికే శకుని తన వంశానికి జరిగిన అన్యాయానికి బదులుగా తన కపట నాటకాలతో కుట్రలతో కౌరవులకు పాండవులకు మధ్య యుద్దాన్ని సృష్టిస్తాడు. అసలు శకుని అలా చేయడానికి గల కారణాలు ఏమిటి ? కర్ణుడు మరియు దుర్యోధనుడు మధ్య స్నేహం ఎంత గొప్పది ? చివరికీ కౌరవుల మీద పాండవులు ఎలా గెలిచారు ? ఆ గెలుపుకు శ్రీ కృష్ణుడు ఎలా కారణమయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
3 డి లో తీయటం
అర్జున్,దర్శన్
స్నేహ
డైరెక్షన్
మైనస్ పాయింట్స్ :
ఎమోషనల్ గా లేకపోవటం
స్క్రీన్ ప్లే
సాంకేతిక విభాగం :
దర్శకుడు నాగన్న 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. సినిమా చూస్తున్నంతసేపూ పాత సినిమాలు చూస్తున్న ఫీల్ తెచ్చాడు. మెయిన్ గా కథనం బాగా నిరాశ పరుస్తోంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఉన్న విజువల్స్ ను కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
చివరి మాట : మహాభారతం లాంటి అత్యద్బత దృశ్య కావ్యం 3డిలో నాగన్న దర్శకత్వంలో అర్జున్, దర్శన్, నిఖిల్ గౌడ్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ ‘కురుక్షేత్రం’ పాత సినిమాల సమ్మేళనంగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపూ ‘దాన వీర శూర కర్ణ’నే గుర్తుకువస్తోంది. దానికి తోడు దర్శకుడు నాగన్న 3డి విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాలు మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. మొత్తానికి ఆసక్తికరంగా సాగని ఈ ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను మెప్పించదు. అయితే ఇలాంటి నేపథ్యంలోని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా కొంతమేరకు మెప్పించొచ్చు.