ఇక సందీప్ కామెడీ – తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ టీజర్ రివ్యూ!

ఇక సందీప్ కామెడీ – ‘తెనాలి రామకృష్ణ బిఏ, బిఎల్’ టీజర్ రివ్యూ!

సందీప్ కిషన్ ఇంకో వెరైటీతో వచ్చేస్తున్నాడు… ‘తెనాలి రామకృష్ణ  బిఏ, బిఎల్’ అనే కామెడీతో నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి కామెడీ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో హీరోయిన్ హన్సికతో నటించాడు. ఈ టీజర్ కామిక్ లాయర్ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తోంది. కేసుల్లేక అఫర్ లిచ్చే లాయర్ గా హల్చల్ చేస్తూ… ఒక కేసు ఇస్తే ఇంకో కేసు ఫ్రీ అని,  పేటీఎం చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనీ, కేసు ఓడిపోతే 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటూ  ఆఫర్లు ఇస్తూ… హడావిడీ చేస్తున్నాడు.

కర్నూలులో వరలక్ష్మిని కాపాడే లాయరే లేడన్న ఛాలెంజిని స్వీకరించే డేరింగ్ లాయర్ గా పాత్ర కన్పిస్తోంది. వరలక్ష్మి పోలిటీషియన్. సందీప్ కి అడ్డు పడే లాయర్ గా మురళీ శర్మ, ఇంకో లాయర్ గా హన్సిక కన్పిస్తున్నారు. తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కన్పిస్తోంది. మొత్తం ఈ కామెడీ హడావిడిలో కామెడీ జడ్జిగా పోసాని, ఇతర పాత్రల్లో సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను కన్పిస్తున్నారు.

సప్తగిరితో ఆ మధ్య ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ వచ్చింది. ఇది హిందీ రిమేక్. అయినా ఫ్లాపయ్యింది. ఇప్పుడు సందీప్ ‘తెనాలి రామకృష్ణ  బిఏ, బిఎల్’ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. హిట్లు లేని దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డికి ఇదొక పరీక్షే. దీనికి నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి. శేఖర్ చంద్ర సంగీతం, శ్యాం కె నాయుడు ఛాయాగ్రహణం. తెలుగు తమిళ భాషల్లో ముస్తాబవుతోంది.

 

 

Tenali Ramakrishna BABL Movie Motion Teaser | Sundeep Kishan, Hansika, G Nageswara Reddy