ఇదీ కెలుకుడు వ్యవహారమేనట.!

ఈ మధ్యనే ఓ సినిమా వచ్చింది. ఓ యంగ్ హీరో సినిమా అది.! ఫస్టాఫ్ బావుంది.. సెకెండాఫ్ దెబ్బ కొట్టింది.. అంటూ ఆ సినిమా గురించి రివ్యూలొచ్చాయ్.! మీడియా పర్సనాలిటీస్ మీద సెటైర్లేసినంత తేలిక కాదు, సినిమా తీయడం.. అన్న విమర్శలు ఆ సినిమా మీద గట్టిగా వినిపిస్తున్నాయ్.

పైగా, అతి విశ్వాసంతో ముందు రోజే, భారీగా ప్రీమియర్స్ వేసేసి.. బొక్క బోర్లా పడ్డారు ఆ సినిమా మేకర్స్. పీఆర్ పైత్యం సహా చాలా వ్యవహారాలు.. సినిమా మీద చాలామంది పెదవి విరిచేలా చేశాయ్.

ఇక, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తోన్న గాసిప్ ఏంటంటే, హీరోగారి ‘కెలుకుడు’ సినిమాని నాశనం చేసిందని. ఫస్టాఫ్ సరిగ్గానే డీల్ చేసిన దర్శకుడు, సెకెండాఫ్‌లో హీరో కారణంగానే బోల్తా పడ్డాడట. సినిమా ఫ్లాపయ్యింది కాబట్టి ఇలా.. అదే హిట్టయ్యుంటేనో.? అని సదరు హీరోగారి అభిమానులు అంటున్నారు.