డైరెక్టర్‌తో పనేంటి.? నిర్మాతకి హీరోగారి ఉచిత సలహా.!

ఆయనో యంగ్ హీరో. ఓ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇంకో సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు కూడా. నిర్మాణం కూడా అతనే చేసుకోగలడు. సరిపోయింది.. ఇకపై ఎవరు సినిమాల్ని వారే డైరెక్ట్ చేసేసుకోవచ్చు.. ప్రొడ్యూస్ చేసేసుకోవచ్చు. నిర్మాతలు, దర్శకులతో పనేంటి హీరోలకి.? అందరూ అలా వుండరు. కొందరు మాత్రమే అలా వుంటారు. అడివి శేష్ నటుడే కాదు, దర్శకుడు కూడా. సినిమాలూ నిర్మించుకోగలడు. కానీ, అతనితో నాని, మహేష్ లాంటి హీరోలు సినిమాలు నిర్మించట్లేదా.?

సినిమా అంటే కళాత్మక వ్యాపారం. అందరూ కలిసి పనిచేస్తే అద్భుతమైన సినిమా అవుతుంది. అంతా మేమే చేసుకుంటాం.. అంటే, అంతే సంగతులు. ఓ ప్రముఖ హీరో అండదండలు మనోడికి దొరకేసరికి, ఎవర్నీ లెక్క చేయట్లేదట. నేనే హీరో.. నేనే డైరెక్టర్.. అంటున్నాడట. దాంతో నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అవుతోందిట. డైరెక్టర్‌ని తెచ్చుకుంటారా.? అయినా, నేను చెప్పినట్టే నడaవాలి.. అని నిర్మాతలకు కండిషన్లు పెడుతున్నాడట ఆ కుర్ర హీరో.