తెలుగమ్మాయ్‌కి నో చెప్పిన యంగ్ హీరో.!

‘చెన్నై నుంచో, బెంగుళూర్ నుంచో, లేక కేరళ నుంచో హీరోయిన్‌ని తెచ్చుకుందాం.. తెలుగు హీరోయిన్ అయితే వద్దులే..’ ఇది ఓ యంగ్ హీరో మనసులోని మాట. తనదైన ఆటిట్యూడ్‌తో ఆ యంగ్ హీరో ఓ మోస్తరు స్టార్ ‌డమ్ తెచ్చుకున్నాడు.

వరుసగా సినిమాలు కూడా చేసుకుంటూ పోతున్నాడు హిట్, ఫ్లాప్‌తో పని లేకుండా. దాంతో, ఈ మధ్య ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరోయిన్‌గా డైరెక్టర్ తెలుగమ్మాయిల చర్చ తీసుకొచ్చాడట సదరు హీరో దగ్గర.

తెలుగమ్మాయిలున్నారు కదా.. వాళ్లకీ ఫాలోయింగ్ పెరుగుతోంది కదా.. అని ఆ యంగ్ డైరెక్టర్ పలువురు తెలుగు హీరోయిన్ల
పేర్లను సూచించగా, మన హీరోగారు సింపుల్‌గా నో చెప్పేశాడట.

ఈ మధ్యనే హిట్టు కొట్టిన ఓ చిన్న సినిమా హీరోయిన్ పేరు కూడా ఆ యువ నటుడి దగ్గర ప్రస్థావనకొచ్చిందట. అయినా కానీ, ససేమిరా అనేశాడట ఆ కుర్ర హీరో.

మరోవైపు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలే, తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేద్దాం అంటుంటే.. ఈ కుర్ర హీరో మాత్రం ఏంటిలా ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ సదరు డైరెక్టర్ తల పట్టుకుంటున్నాడట. ఇంతకీ ఎవరా కుర్రహీరో.? ఏంటా కథ.?