యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ రహస్య గోరక్‌ని పెళ్ళాడనున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్యా ప్రేమాయణం గురించి ఒక్క గాసిప్పూ బయటకు పొక్కలేదు. నిజానికి, కిరణ్ అబ్బవరం పెళ్ళికి సంబంధించిన న్యూస్ అందరికీ షాకింగే.
కానీ, ఇక్కడ విషయం కిరణ్ అబ్బవరం గురించి కాదు. ఇంకో యంగ్ హీరో గురించి. బ్యాక్ గ్రౌండ్ వున్న హీరోనే.! సరైన సక్సెస్సు అయితే లేదతనికి. గతంలో పెళ్ళి ప్రపోజల్ నడిచింది. ‘అప్పుడే పెళ్ళేంటి.?’ అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. కుర్రాడేమో సరదా పడ్డాడు. ఆ సరదా కొద్ది కాలానికే తీరిపోయింది.
స్టిల్ బ్యాచిలర్ ఆ యంగ్ హీరో.! ఇప్పుడేమో పెళ్ళి ప్రయత్నాలు షురూ అయ్యాయట. ఓ ఇంటివాడ్ని చేస్తే అయినా టైమ్ కలిసొస్తుందేమోనని పేరెంట్స్ అనుకుంటున్నారని తెలుస్తోంది. అమ్మాయి కూడా అందుబాటులోనే వుందట. అంటే, బంధువుల అమ్మాయేనట.
డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. పెళ్ళి కంటే ముందు ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసెయ్యాలని చూస్తున్నారు. పెళ్ళి డేట్ కొంచెం వాయిదా వేసేసి, సినిమా పూర్తి చేసేస్తే బావుంటుందనే ఆలోచన కూడా జరుగుతోందట. సినిమాపై ప్రకటన అయితే త్వరలో రాబోతోందని తెలుస్తోంది.
పెళ్ళి ప్రకటన మాత్రం, ఆచి తూచి చేస్తారని సమాచారం. కుర్రాడి ట్రాక్ రికార్డు అలాంటిది మరి.!