K Ramp Teaser: ఈ రోజు సాయంత్రం హీరో కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్” దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే “K-ర్యాంప్” నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు టీజర్ కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు “K-ర్యాంప్” సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. సినిమాలో హెవీ ఎంటర్ టైన్ ఎంతగా ఉండబోతుందో టీజర్ చూపించనుంది. “K-ర్యాంప్” టీజర్ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

గ్రామస్తుల సమస్య – గంట వ్యవధిలోనే పరిష్కరించిన ఎరిక్షన్ బాబు

షర్మిల సంచలన ఆరోపణలు: మోదీ, ఈసీఐపై తీవ్ర విమర్శలు

“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని

Public Reaction On 15 Months Of Kutami Govt Ruling  | Telugu Rajyam