మీరే నా ఫ్యామిలీ.. యశోద రిలీజ్ అనంతరం సమంత ఎమోషనల్ పోస్ట్!

సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషలలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ విధంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మునుపటి సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మీ సహకారం ఎక్కువగా ఉందని ఆశిస్తున్నాను. సినిమాని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు.ఇలాంటి సమయంలో నాపై చూపించిన ఆప్యాయతకు ఎల్లప్పుడూ కృతజ్ఞరాలిని. మీరే నా ఫ్యామిలీ ఈ సినిమాని థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరమైన విషయం తెలిసిందే.ఇలా సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనకపోవడంతో ఈ సినిమాకు మైనస్ గా మారుతుందని భావించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంతా సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.మరి కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.