సమంత మళ్ళీ అవే పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.?

సమంతకి ఏమయ్యింది.? ఔను, సమంతకి మళ్ళీ ఏమయ్యింది.? ఇంకేమవుతుంది.? మయోసైటిస్ సమస్యతో బాధపడుతోంది.. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సోషల్ మీడియాలో సమంత అనారోగ్య సమస్య మీద జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. ఆమెకు అనారోగ్య సమస్య వున్నమాట వాస్తవం. అయినాగానీ, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల ప్రమోషన్లలో పాల్గొంది. ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసింది.

‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది సమంత. ‘ఖుషీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న దరిమిలా, సమంత అనారోగ్య సమస్య ఇంకోసారి హాట్ టాపిక్ అయ్యింది.

సమంత పీఆర్ టీమ్ మళ్ళీ పబ్లిసిటీస్టంట్లు మొదలెట్టిందనీ, ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హంగామా షురూ అయ్యిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. సమంత మీద తొలుత నెగెటివ్ కామెంట్స్, ఆ తర్వాత సమంత స్పందించడం.. ఈలోగా నాగచైతన్య అభిమానులు రెచ్చిపోవడం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.

ఇంతకీ, ఈ మొత్తం వ్యవహారంలో సమంత పాత్ర ఎంత.? ఏమో, ఆమెకే తెలియాలి.