చెవిలో వెంట్రుకల పేరుచెప్పి ఇచ్చిపాడేసిన సమంత!

పైకి కనిపించదు కానీ… సమంత చాలా స్ట్రాంగే! విడాకులు తీసుకున్న సమయంలో ఆమె ఎంత ఒత్తిడికి గురైఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! అప్పటికే చాలా స్ట్రాంగ్ గా నిరూపించుకున్న సమంత… తాజాగా తాను అన్ని విషయాల్లోనూ స్ట్రాంగే.. తనను మరీ గెలికితే.. తాను మరింతగా రెచ్చిపోతాను.. చిన్నా పెద్దా అనేది కూడా చూడను.. అన్నస్థాయిలో తనపై కామెంట్లు చేసిన నిర్మాతకు ఇచ్చిపాడేసింది.

తనను తాను తెలుగు సినిమా శ్రేయోభిలాషిగా, సినీ మేధావిగా చెప్పుకుని కాలం వెళ్లదీస్తున్నాడనే విమర్శ ఉన్న నిర్మాత చిట్టిబాబు తాజాగా సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమంత ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ కాదని, అసలు హీరోయిన్‌ రేంజ్‌ కూడా తనకు లేదని ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఎన్నెన్నో తీసిన ఈ టాప్ ప్రొడ్యూసర్ విమర్శలు చేశారు!

అక్కడితో ఆగని.. సంచలన సినిమాలు నిర్మించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్… యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్‌ అవడానికి ముందు సమంత కావాలని ఏడుస్తూ సింపథీ డ్రామాలు ఆడి, పిచ్చి వేషాలు వేసిందని తీవ్ర ఆరోపణలు ఎన్నో చేశాడు! దీంతో… ఎవ్వరూ ఊహించని స్థాయిలో సెటైర్స్ వేసింది సమంత. దీంతో… ఈ కామెంట్లు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి!

చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై సామ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చెవిలో జుట్టు పెరగడం గురించి మాట్లాడుతూ.. పరోక్షంగా ఆయనకు చురకంటించారు! జనాలకు చెవుల్లో నుంచి జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్‍‌ లో సెర్చ్ చేసిన సామ్.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని పోస్ట్ చేస్తూ… టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎదుగుదల వల్లే చెవిలో వెంట్రులకు పెరుగుతాయి అని తనకి గూగుల్ లో సమాధానం వచ్చిందంటూ ఆ స్క్రీన్ షాట్స్ ని పోస్ట్ చేస్తూ… ఈ పోస్టుకు “ఇఫ్‌ యు నో యు నో” అని క్యాప్షన్‌ ఇచ్చింది.

దీంతో… నిర్మాత చిట్టిబాబుకు చెవిలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమంత సదరు నిర్మాతకే కౌంటరిచ్చిందని అభిప్రాయపడుతున్నారు ఆమె ఫ్యాన్స్‌. కాగా నిర్మాత చిట్టిబాబు, త్రిపురనేని చిట్టిబాబు అనేకంటే… చెవిలో వెంట్రుకలు ఉంటాయి చూడు ఆ చిటీబాబు అంటేనే గుర్తుపడతారని ఒక కామెంట్ ఫిల్మ్ నగర్ లో వర్గాల్లో ఉండటం కొసమెరుపు!