బి టౌన్ పై యష్ ‘రాకీభాయ్’ మార్క్ సమాధానం.!

ఇప్పుడు మన సౌత్ ఇండియా నుంచి పలువురు హీరోల స్టార్డం ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెయిన్ గా అయితే మొదట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మార్కెట్ ఓ రేంజ్ లో పెంచుకోగా ఇక నెక్స్ట్ తన బాటలో కేజీఎఫ్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఇదే కోవలో చేరాడు.

మరి యష్ కి అయితే ఇంత క్రేజ్ రావడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ అందులోని రాకీభాయ్ గా తన రాకింగ్ యాటిట్యూడ్ లే అని చెప్పాలి. అయితే లేటెస్ట్ గా ఇదే యాటిట్యూడ్ తో యష్ లేటెస్ట్ గా రియల్ లైఫ్ లో ఇచ్చిన క్రేజీ సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

తన కుటుంబ సమేతంగా యష్ కర్ణాటకలో ఓ దేవాలయ సందర్శనానికి వెళ్లగా అక్కడ మీడియా వారు యష్ మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా యష్ దానికి ఏమాత్రం బెణకకుండా “నేను అక్కడికి వెళ్లడం వారినే ఇక్కడికి రప్పించా” అంటూ సమాధానం ఇచ్చాడు.

దీనితో ఈ ఊహించని సమాధానం మాత్రం డెఫినెట్ గా రాకీ భాయ్ లోని యాటిట్యూడ్ ని చూపిస్తుంది అని చెప్పాలి. కాగా ఇది వరకే యష్ అయితే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడని పలు రూమర్స్ వచ్చాయి. దానిని ఒప్పుకున్నాడని కూడా టాక్ రాగా వాటిని పటాపంచలు చేస్తూ యష్ ఇచ్చిన ఈ సమాధానం మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది.

ఇక యష్ అయితే తన నెక్స్ట్ 19వ ప్రాజెక్ట్ ని అతి త్వరలోనే డైరెక్టర్ తో అనౌన్స్ చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓ లేడీ డైరెక్టర్ చేయనున్నారని టాక్ ఉంది.