ప్రభాస్ తో యష్ రాజ్.. 2 ఆప్షన్స్!

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటించడం ఖాయమనీ ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. ఆ సినిమాను భారతదేశంలోని మూడు ప్రధాన నిర్మాణ సంస్థలు – మైత్రీ మూవీ మేకర్స్, యువి క్రియేషన్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ లతో రూపొందుతుంది. టాక్ ప్రకారం అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ కోసం ఒక ఫ్రాంచైజీ చిత్రంలో ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం.

ఈ ఫ్రాంచైజీ చిత్రంలో ప్రభాస్ కోసం 2 అప్షన్స్ ఉన్నాయి. మొదటి ఛాన్స్ ఏక్ థా టైగర్, వార్, పఠాన్ వంటి చిత్రాలను నిర్మించిన యష్ రాజ్ ఫిల్మ్స్ స్పైవర్స్‌లో భాగం కావడం. ఆ కథల్లో వివిధ ప్రధాన నటులు భారత ప్రభుత్వ ప్రధాన ఏజెంట్ల పాత్రలు పోషిస్తున్నారు. రెండవ ఆప్షన్ లో ధూమ్ 4లో షారుఖ్ ఖాన్‌తో కలిసి లేదా మరో వెర్షన్‌లో ప్రధాన పాత్ర పోషించడం.

ప్రస్తుతం ఫ్రాంచైజీ చిత్రానికి సంబంధించి ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక దర్శకుడు ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్, సిద్ధార్థ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు ప్రభాస్ రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మొత్తానికి ఈ వార్త ప్రభాస్ అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబినేషన్లో ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు ప్రధాన నిర్మాణ సంస్థల మధ్య సహకారంతో ప్రభాస్ స్పైవర్స్‌లో చేరడం లేదా ధూమ్ 4 లో నటించే అవకాశం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని భావిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అఫీషియల్ ఏనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.