ఇంటి వాడైన జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్.. వేడుక‌కు హాజ‌రైన ప‌లువురు ప్ర‌ముఖులు

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తూ క‌డుపుబ్బ న‌వ్విస్తున్నారు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్. ఈ షో వ‌ల‌న చాలా మందికి మ‌న‌శ్శాంతి దొరుకుతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేక్ష‌కులని అలరిస్తూ వ‌స్తున్న ఈ షో ఇందులో న‌టించే న‌టీన‌టుల‌కు కూడా ఓ దారిని చూపించింది. జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ల‌న చాలా మంది క‌మెడీయ‌న్స్ జీవితంలో స్థిర ప‌డ్డారు. రెండు చేతులా సంపాదిస్తూ ఇళ్లు కూడా క‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్ చాలా మంది ఇంటి వారు కాగా, తాజాగా జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన ప‌వ‌న్ కూడా గృహ‌ప్ర‌వేశం చేశాడు.

ప‌వ‌న్ ఎక్కువ‌గా లేడి గెటప్స్‌లోనే కనిపిస్తుంటాడు. ఢీ షోలో కూడా లేడి గెట‌ప్‌లోనే డ్యాన్స్ లు చేసి అల‌రించాడు. చ‌మ్మ‌క్ చంద్ర టీంలో కీల‌క వ్యక్తిగా ఉన్న ప‌వ‌న్ ఇటు జ‌బ‌ర్ధ‌స్త్ అటు అదిరింది షోలతో పాటు ప‌లు ఈవెంట్స్‌తోను బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో నాలుగు పైస‌లు వెన‌కేసుకున్న ప‌వ‌న్ కొత్తింటిని కొనుగోలు చేశాడు. తాజాగా గృహ‌ప్ర‌వేశ వేడుక జ‌ర‌గ‌గా, దీనికి చ‌మ్మ‌క్ చంద్ర‌, ఫ‌ణితో పాటు ప‌లువురు నటీనటులు హాజ‌ర‌య్యారు.

ప‌వ‌న్ త‌న యూట్యూబ్ ఛానెల్‌లో గృహ‌ప్ర‌వేశానికి సంబంధించిన వీడియో షేర్ చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారింది. ఇందులో చాలా ఉత్సాహంగా క‌నిపించిన ప‌వ‌న్ త‌న ఇంటికి వ‌చ్చిన గెస్ట్‌ల‌ని సాద‌రంగా ఆహ్వానించి వారికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. చ‌మ్మ‌క్ చంద్ర త‌న టీమ్ మేట్‌కు ఏదో జ్యువెల‌రీని బ‌హుమ‌తిగా అందించారు. ఏదేమైన జ‌బ‌ర్ధ‌స్త్ అనే కార్య‌క్ర‌మంతో చాలా మంది న‌టులు జీవితంలో స్థిర‌ప‌డ‌డ‌మే కాక మంచి లైఫ్‌ను అనుభ‌విస్తుండ‌డం గ‌మ‌న‌ర్హం.