మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెబ్యూ సినిమా ముకుంద, అక్కినేని నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాలతో సక్సస్ అందుకుంది పూజా హెగ్డే. కాని స్టార్ గా మాత్రం క్రేజ్ దక్కించుకోలేకపోయింది. కాని హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘డీజే’ దువ్వాడ జగన్నాధం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సాధించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇక టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ‘అరవింద సమేత’, ‘మహర్షి’ గద్దల కొండ గణేష్, ‘అల.. వైకుంఠపురములో’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానం తో పాటు మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ లో పూజా హెగ్డే కి ఉన్న ఫాలోయింగ్ ఎవరూ ఊహించనిది. దీంతో మేకర్స్ పూజా హెగ్డే విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదని అంటున్నారు.
కరోనా కారణంగా ఇండస్ట్రీలో తలెత్తిన పరిస్థితుల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలంతా కలిసి స్టార్లకు ఇచ్చే రెమ్యునరేషన్ లో ఇరవై శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. కానీ పూజా మాత్రం ఈ విషయంలో కాస్త కూడా కాంప్రమైజ్ కానని అంటుందట. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఆఫర్లు కూడా వస్తున్నాయి కాబట్టి రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచన లేదని నిర్మొహమాటంగా చెబుతుందట.
ఇప్పుడు బాలీవుడ్ లో పూజా కి ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారో అదే రెమ్యూనరేషన్ తెలుగు సినిమాకి ఇవ్వాలని మొహమాటం లేకుండా చెబుతుందని సమాచారం. ఇటీవలే తెలుగు సినిమా కోసం పూజా ని సంప్రదిస్తే రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అదే మాట మిగతా మేకర్స్ కి చెబుతున్నట్టు సమాచారం. అయినప్పటికీ పూజాకి ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు పూజా అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడటం లేదని తెలుస్తుంది. తప్పదు కదా.. క్రేజ్ లేనప్పుడు ఎంత స్టార్ హీరోయిన్ గా వెలిగినా పట్టించుకునే నాధుడే ఉండడు. పూజా స్ట్రాటజీ కరెక్టే అని చెప్పుకుంటున్నారు.