పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి కొన్ని సీక్వెన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అదే పనిలో సముద్రఖని ఉన్నారు. గోపాల గోపాల తరహాలో ఫిక్షనల్ టచ్ ఉన్న సోషల్ కాన్సెప్ట్ గానే ఈ మూవీ రాబోతోంది.
ఇప్పటికే తమిళంలో వినోదాయ సీతమ్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ చేయడంతోనే బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆదిపురుష్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని ఏకంగా 185 కోట్లు పెట్టి కొనేసింది. అయితే ఇప్పుడు మూవీ మొదటి మూడు రోజులు కలెక్షన్స్ భాగానే వచ్చిన సోమవారం నుంచి పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. భారీ నష్టాలు కాకపోయిన బ్రేక్ ఎవెన్ అయితే వచ్చే పరిస్థితి లేదు.
ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే బ్రో మీద పడే అవకాశం ఉంది. బయ్యర్లు ఇప్పటికే బ్రో రైట్స్ కోసం ట్రై చేసిన ఎక్కువ డిమాండ్ చేయడంతో కాస్తా వెనకడుగు వేసారు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ డిజాస్టర్ కావడంతో ఆ నష్టాలని బ్రో మూవీ ద్వారా పూడ్చుకోవాలి. ఆదిపురుష్ తో నష్టపోయిన బయ్యర్లు బ్రోని తక్కువ రెట్లకి ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉంది.
ఇవ్వక తప్పని పరిస్థితి కూడా నెలకొంది. బ్రో సినిమాపై ఎక్కువ బిజినెస్ నే నిర్మాతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ లెక్క చూసుకున్న 130 కోట్ల వరకు వ్యాపారం జరిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో భాగానే వస్తాయి. ఆదిపురుష్ ఇచ్చిన స్ట్రోక్ నుంచి పవన్ కళ్యాణ్ బ్రో పీపుల్స్ మీడియా వారిని ఎంత వరకు బయట పడేయగలదు అనేది ఇప్పుడు చూడాలి.
భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హైలోనే ఉన్నాయి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటలు, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి సమకూర్చారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.