Sara Tendulkar: ఆ హీరోతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సారా టెండూల్కర్..?

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సచిన్ గత కొన్ని సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సచిన్ కూతురు సారా టెండూల్కర్ ప్రస్తుతం తన మెడిసన్ పూర్తి చేసుకుంది. చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి సారా ఇప్పటికే మోడలింగ్ పూర్తి చేసింది. అలాగే ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు.ఈ క్రమంలోనే తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని గతంలో పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాలలో హీరోయిన్ గా సారా టెండూల్కర్ కు అవకాశాలు ఇచ్చారు.

ఈ విధంగా తనకు వచ్చిన అవకాశాలను సారా టెండూల్కర్ ఎంతో సున్నితంగా తిరస్కరించారు. చదువు పూర్తయ్యే వరకు నటనవైపు రాకూడదని సారా నిర్ణయం తీసుకోవడంతో సినిమా అవకాశాలను తిరస్కరించారు.అయితే ప్రస్తుతం ఈమె డాక్టర్ చదువు పూర్తి కావడంతో సినిమాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే గతంలో సారా టెండూల్కర్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తోకలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సచిన్ టెండూల్కర్ కొట్టిపారేశారు. మరి ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనున్నారు, ఏ హీరోతో ఇవ్వనున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.