అభిమానిని పవన్ కళ్యాణ్ కరుణిస్తాడా.?

నితిన్‌కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పవన్ కళ్యాణ్‌కీ నితిన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. నితిన్ తన సినిమాల్లో ఎక్కడో ఒక చోట పవన్ రిఫరెన్సులు వుండేలా చూసుకుంటాడు. ఓ పాటని సైతం రీమిక్స్ చేసుకున్నాడు కూడా.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా నితిన్‌పై వున్న అభిమానంతో నితిన్ సినిమాకి ప్రొడ్యూసర్‌గా ఛాన్స్ తీసుకున్నాడు. అదే ‘ఛల్ మోహన్ రంగా’. త్రివిక్రమ్, పవన్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు.

అయితే, నితిన్ ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని గెస్ట్‌గా ఓ చిన్న రోల్ చేయమని అడుగుతున్నాడట. కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రిట అది.

వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, పవన్ ప్రస్తుతం వున్న బిజీ షెడ్యూల్స్‌లో అది సాధ్యమవుతుందా.?

ఈ సినిమాలో పవన్‌కి రీల్ లైఫ్ వీరాభిమానిగా నటించనున్నాడట నితిన్. అలా ఓ సన్నివేశంలో తన అభిమాన హీరోని కలిసే అవకాశంలో రియల్‌గా పవన్ కళ్యాణ్‌నే ఆ పాత్రలో చూపించాలని నితిన్ ఆరాటపడుతున్నాడట. చూడాలి మరి, ఈ పిచ్చి అభిమాని కోసం పవన్ కళ్యాణ్ ఆ రోల్ చేసేందుకు ఒప్పుకుంటాడా.?