ఈ సీజన్లో కూడా ఫైనల్ లో ట్రోఫీ అందుకునేది పురుషుడేనా? మగువలకు ఈసారి కూడా లేదా?

Will men win the Bigg Boss title this time too?

బిగ్‌బాస్ హౌస్ సీజన్లో 4 లో మొదట 19 మంది కంటెస్టెంట్ల‌తో మొదలు పెట్టినప్పుడు అందులో 10 మంది అమ్మాయిలే ఉండేవారు. కానీ ఆ సంఖ్య‌ ఇప్పుడు మూడుకు చేరింది. మోనాల్‌, హారిక‌, అరియానా మాత్ర‌మే ఇంకా హౌస్‌లో నిల‌దొక్కుకోగ‌లిగారు. స్ట్రాంగ్‌గా ఉంటూ అంద‌రినీ గ‌డ‌గ‌డ‌లాడించిన అరియానా, అవినాష్ చెంత‌న చేరి త‌న గేమ్ త‌నే నాశ‌నం చేసుకుంటోంది. అటు హారిక మ‌గాళ్ల‌తో స‌మానంగా పోటీప‌డుతున్న‌ప్ప‌టికీ రిలేష‌న్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తూ కేరాఫ్ అభిజిత్‌గా మారిపోయింది. మోనాల్ మీద‌ వ్య‌తిరేక‌త ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది కానీ టైటిల్ కొట్టేంత శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ఆమెలో లేనట్లే ఉన్నాయి. మిగ‌తావాళ్ల ఆటతో పోలిస్తే వీళ్ల‌లో ఒక్కరు కూడా టైటిల్ గెలుచుకోలేరనిపిస్తుంది.

Hariak, Monal and Ariyana

ఈ సీజన్‌లో విజేత మగవారి నుండే ఉంటుందని , అమ్మాయిలలో ట్రోఫీ గెలిచేవారు లేరని , ఈసారి కూడా అమ్మాయి టైటిల్ విన్నర్ అవ్వటమనేది ప‌గ‌టి క‌ల‌గానే మార‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎనీ టైమ్‌ అభిజిత్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. అత‌డే విన్న‌ర్ అని తేల్చేస్తున్నారు. ఏ పోలింగ్ సైట్లు చూసినా అత‌డికే సుమారు 40 శాతం ఓట్లు ప‌డుతుండ‌టం విశేషం. త‌ర్వాత టైటిల్ రేసులో సోహైల్‌, అఖిల్ ఉన్నారు. ఈ ఇద్ద‌రిలో ఇప్ప‌టికే అఖిల్ టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈ సీజ‌న్‌ టైటిల్ పోరు అభిజిత్‌, అఖిల్‌, సోహైల్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఈ మూడు వారాల్లో ఏదైనా అద్భుతం జ‌రిగి అమ్మాయిలు టాస్కుల్లో అబ్బాయిల‌ను డామినేట్ చేసినా వాళ్లు టాప్ 3కి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంది కాని ఫైనల్ విన్నర్ మాత్రం కాలేరని అర్ధమవుతుంది.