భయపెడుతున్న ‘ఆది పురుష్’.?

ఎంత బలవంతంగా రుద్దుదామనుకున్నా‘ఆది పురుష్’ సినిమా మీద ఎంత మాత్రమూ బజ్ ఏర్పడడం లేదు. దాంతో అటు నిర్మాతలు, ఇటు బయ్యర్స్‌లో చాలా టెన్షన్ పెరగిపోతోందట.

వాళ్లే కాదు, ఎప్పుడూ లేని విధంగా ప్రబాస్ కూడా టెన్షన్ పడుతున్నాడట. ఒకవేళ రిజల్ట్ ఏమైనా తేడా వస్తే తాను ఆదుకుంటానంటూ ముందుగానే ప్రబాస్ తెలుగు బయ్యర్స్‌కి హామీలిస్తున్నాడట. ఈ వ్యవహారం సినిమాపై మరిన్నిఅనుమానాలకు కారణమవుతోంది. ఈ మధ్య సినిమాలు ప్లాప్ అవుతుంటే నిర్మాతలు, బయ్యర్లు అస్సలూరుకోవడం లేదు. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

డైరెక్టర్ కానీ, హీరో కానీ బాధ్యత తీసుకోకుంటే కుదరడం లేదు. ‘ఆచార్య’, ‘లైగర్’ సినిమాల విషయంలో ఏం జరిగిందో చూశాం. చూస్తున్నాం. సో, ‘ఆది పురుష్’ విషయంలోనూ అలాంటిదేదైనా జరిగుతుందేమో అని ప్రబాస్ ముందుగానే అలర్ట్ అయిపోయినట్లున్నాడని ఇండస్ర్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి ఏం జరుగుతుందో.