ప్రభాస్‌పై ఎందుకొస్తున్నాయ్ ఈ పుకార్లు.?

యూనివర్సల్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రబాస్. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలూ, భారీ బడ్జెట్ సినిమాలే. అయితే, ప్రబాస్ ఈ మధ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, ముఖ్యంగా మోకాలి సమస్య ప్రబాస్‌ని వేధిస్తోందనీ అంటున్నారు. కొంతకాలంగా మోకాలి సమస్యతో ప్రబాస్ బాధపడుతున్న సంగతి నిజమే.

‘రాధేశ్యామ్’ టైమ్‌లో ఆ నొప్పి తీవ్రంగా వేధించింది. ఆ సినిమా తర్వాత ప్రబాస్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. కానీ, ఫలితం లేదనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ భారీ యాక్షన్ బేస్‌డ్ సినిమాలే. సో, యాక్షన్ సీన్స్ చేయాలంటే ప్రబాస్‌తో చాలా కష్టమవుతోందట. దాంతో, డూప్‌తో మేనేజ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

జస్ట్ ప్రచారమే అని లైట్ తీసుకోవడానికి లేదు.. ఇదే ప్రచారం తీవ్రతరం అయితే, ప్రబాస్ కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. అయితే, అదంతా ఉత్తదేనంటోంది ప్రభాస్ టీమ్. ఏది నిజమో తెలియాల్సి వుంది.