రామ్‌చరణ్ ఫ్రస్ట్రేషన్.. అదే కారణమా.?

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. షూటింగ్ కూడా నత్త నడకనే నడుస్తోంది. ఏదీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదట.

దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ‘వారసుడు’ సినిమాతో దిల్ రాజు చప్పబడిపోయాడు. శంకర్‌కీ ఎటూ చెప్పలేని తీరు. ఏం చేస్తాడు.? శంకర్‌తో అట్లుంటది మరి. అసలే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’తో బిగ్ ఫెయిల్యూర్ తినేసి వున్నాడు రామ్ చరణ్. ఆ ఎఫెక్ట్ నుంచి ఎలాగైనా బయటికి రావాలంటే, ఇంకో సినిమాతో వీలైనంత త్వరగా రావాల్సిందే.

పరిస్థితి చూస్తుంటే అస్సలు అనుకూలంగా లేదు. దాంతో విపరీతమైన ఫ్రస్టేషన్ ఫీలవుతున్నాడట రామ్ చరణ్. అదే ‘వాల్తేర్ వీరయ్య’ సక్సెస్ మీట్‌లో బయటపడిపోయాడు. ఫ్యాన్స్‌ సాక్షిగా మెగా ఫ్యామిలీపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటూ, నిర్మాతల ప్లానింగ్ గురించి కూడా క్లాస్ తసీుకున్నాడు చరణ్.

బహుశా ఆ క్లాస్ దిల్ రాజుని వుద్దేశించేనేమో.! కానీ, దిల్ రాజు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. శంకర్‌ని నమ్ముకోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు. చరణ్ సినిమాతో పాటూ, కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’… రెండు సినిమాలు చేస్తున్నాడు ఒకేసారి. అదీ అవ్వట్లేదు.. ఇదీ అవ్వట్లేదు.