ఎందుకంత భయం అంటూ బిగ్ బీపై ట్రోలింగ్స్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించాడు. ఈయనకు ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం కూడా ఉంది. ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. ప్రతి ఒక్క విషయం పట్ల స్పందిస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ విషయాన్ని ట్వీట్ చేశాడు. అందులో ఏముందంటే.. “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి” అని ఉంది. ఈ ట్వీట్ తో ఆయన తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే.. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించిందేనని అంటున్నారు. మరి సినిమా పేరు లేకుండా ఆయన అలా ట్వీట్ ఎందుకు చేశాడు.. సినిమా పేరు పెట్టడానికి అంత భయం దేనికి అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.