చరణ్, ఎన్టీయార్ ఎందుకు కలవట్లేదబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఇద్దరూ అమెరికాలో వున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన దరిమిలా, ఆ పురస్కారాల వేడుకలో సందడి చేయబోతున్నారు ఎన్టీయార్, రామ్ చరణ్.

అయితే, ఇంతవరకు చరణ్ – ఎన్టీయార్ కలిసి కనిపించలేదు. గతంలో అలా కాదు, ఇద్దర్నీ కలిపే వుంచాడు దర్శకుడు రాజమౌళి. ఈసారి ఎందుకో చరణ్, ఎన్టీయార్ విడివిడిగా అమెరికాలో పలు టీవీ షోల్లో కనిపిస్తున్నారు.

సహజంగానే ఈ విషయమై పుకార్లు పెద్దయెత్తున పుట్టుకొచ్చాయి. ఇద్దరి మధ్యా ‘గ్యాప్’ పెరిగిందంటూ ఎన్టీయార్, చరణ్ అభిమానుల్లో రచ్చ జరుగుతోంది. అయితే, ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ టూర్‌ని జక్కన్న రాజమౌళి డిఫరెంట్‌గా డిజైన్ చేయడం వల్లే ఇదంతా జరిగిందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎటూ రెడ్ కార్పెట్ మీద చరణ్, ఎన్టీయార్ కలుస్తారనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, చరణ్ – ఎన్టీయార్ విడివిగా పలు టాక్ షోలలో పాల్గొంటున్నా, ఒకరి గురించి ఇంకొకరు గొప్పగానే చెప్పుకుంటున్నారు.