50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా సినిమా చేసిన టాలీవుడ్ స్టార్ హీరో… ఎవరంటే?

ప్రస్తుత కాలంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు పోటీ పడుతూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ఎంతో క్రేజ్ ఏర్పడింది.అయితే పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం తెరకెక్కలేదు. పాన్ ఇండియా సినిమాలు 50 సంవత్సరాల క్రితమే తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరి 50 సంవత్సరాల క్రితమే వచ్చిన సినిమా ఏది అందులో నటించిన హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. కేవలం ఆయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయ మూవీస్ బ్యానర్ పై మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చేయడం వెనుక ఒక కసి పట్టుదల ఉంది.

ఈ సినిమా చేయక ముందు నిర్మాత ఎమ్ ఎస్ రెడ్డితో కలిసి కృష్ణ ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నారట.ఈ సినిమా చూస్తూ కృష్ణ ఇలాంటి సినిమాని మనం కూడా తెలుగులో చేయాలని చెప్పగా వెంటనే ఎం.ఎస్.రెడ్డి నవ్వి ఎందుకు ఉన్నవి కూడా అమ్ముకోవడానికా? అని వెటకారంగా మాట్లాడారట.అయితే ఈ సినిమా ఎంతగానో నచ్చిన కృష్ణ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని మోసగాళ్లకు మోసగాడు పేరుతో తెలుగులో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాని ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు తెరకెక్కించారు. ఇలా ఈ సినిమా 1971 ఆగస్టు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది.ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందుకే 50 సంవత్సరాల క్రితమే కృష్ణ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారని చెప్పాలి.