తెలుగు చిత్ర పరిశ్రమలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిఅనంతరం చందమామ మగధీర వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న నటి కాజల్ అగర్వాల్ ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ కు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఒక డైరెక్టర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కాజల్ అగర్వాల్ కు కూడా ఇలాంటివి ఏమీ తెలియకపోవడంతో ఆ డైరెక్టర్ ఈమెను చాలా ఇబ్బందులకు గురి చేశారని సమాచారం. అయితే కాజల్ అగర్వాల్ ఎలాంటి కోపం వచ్చిన కూడా ఇతరులపై తొందరగా తన కోపాన్ని ప్రదర్శించకుండా ఆ బాధను తానే భరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సదురు డైరెక్టర్ పట్ల ఈమె బయట ఎక్కడ ప్రచారం చేయకుండా గమ్మున ఉన్నారట. ఇలా ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులను ఎక్కడ ప్రస్తావించినటువంటి కాజల్ బాధలు ఆ డైరెక్టర్ కి తగిలాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కాజల్ శాపనార్థాలు తనకి బాగా తగలటం వల్ల ఏకంగా ఆ డైరెక్టర్ ఇండస్ట్రీకి కనుమరుగైపోయారని, ఆయనకి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంత సమయం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించినప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈమె భారతీయుడు 2, చంద్రముఖి 2 వంటి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.