Acharya Massive Trailer : ఇన్సైడ్ టాక్ : మెగా బ్లాస్ట్ “ఆచార్య” మాసివ్ ట్రైలర్ కి డేట్ ఇదేనా.?

Acharya Massive Trailer : మళ్లీ మన తెలుగు సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా అపజయం ఎరుగని బ్లాక్ బస్తర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మెగా బ్లాస్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో అత్యంత ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
అయితే నిన్ననే ఈ సినిమా నుంచి మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ పై ఒక హింట్ ఇవ్వగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మాసివ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని దానిపై ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ ప్రకారం అయితే ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై అధికారికంగా ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్టు సమాచారం.
మరి అదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.
అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బహుశా పాన్ ఇండియన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.