Salaar 2: సలార్ 2.. ఇలా అయితే వచ్చేదెప్పుడు?

‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కానీ, ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. మొదటి భాగం కేవలం పునాది మాత్రమే, అసలు కథ ‘శౌర్యంగపర్వం’లోనే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత రాలేదు. ఇక తాజాగా హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే ‘సలార్ 2’ షూటింగ్ మొదలవుతుందని పృథ్విరాజ్ అన్నారు. అయితే, ఎన్టీఆర్ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ అది ఆ సమయానికి పూర్తవుతుందా అన్నది అనుమానాస్పదంగా మారింది. కారణం, ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుండటమే. అలాగే, ఎన్టీఆర్ 2025లో ‘వార్ 2’ ప్రమోషన్‌లో బిజీగా ఉంటాడు. దీంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మధ్యలో బ్రేక్ పడే అవకాశం ఉంది.

ఈ పరిణామాల వల్ల ‘సలార్ 2’ 2026లో ప్రారంభం కావడం కూడా కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇతర నటీనటుల కాల్షీట్లు ఇప్పటికీ ఫైనల్ కాలేదు. పైగా, ప్రశాంత్ నీల్ తన సినిమాలను ఎక్కువ సమయంతో అత్యద్భుతంగా రూపుదిద్దే దర్శకుడు. అందువల్ల, ‘సలార్ 2’ విడుదల 2027కి వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘సలార్ 2’ గురించి త్వరగా అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసే వరకు ఫ్యాన్స్ కేవలం ఓపిక పట్టాల్సిందే. ప్రశాంత్ నీల్ పర్ఫెక్షన్‌కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే, అందువల్ల ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పట్లో ఎలాంటి అప్డేట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

చనిపోయింది పేదవాడే || Social Activst Krishna Kumari About Kumbha Mela Stampede || Telugu Rajyam