RRR Movie: ఇటీవల కాలంలో ఎటువంటి సినిమా అయినా మూడు లేదా నాలుగు వారాల్లో ఓటిటి వేదికల్లోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్ల లలో విడుదల చెయ్యకుండా నేరుగా ఓటిటి ల్లోకే విడుదల చేస్తున్నారు. ఇటీవలే నేరుగా అమెజాన్ ప్రైమ్ లోకి దృశ్యం – 2 విడుదల అయ్యి మంచి హిట్టుని రాబట్టింది. ఈ మధ్య కాలంలో అంత క్రేజ్ ని సంపాదించుకున్నాయి ఓటిటి ప్లాట్ఫారమ్స్. చిన్నసినిమాలు – పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలు ఓటిటి లలోకి వచ్చి సందడి చేస్తున్నాయి.
అయితే జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా మాత్రం రెండున్నర నెలల నుంచి మూడు నెలల తర్వాతే డిజిటల్ వేదిక మీదకు రాబోతున్నదని మూవీ మేకర్స్ చెప్తున్నారు. “ఆర్ఆర్ఆర్” సినిమాని హిందీ లో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత నిర్మాత జయంతిలాల్ గడా ఈ విషయాన్ని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటిటి లలో అడుగుపెట్టబోతుందని జయంతి లాల్ వెల్లడించారు. ఈ సినిమా ని థియేటర్ ఎక్సపీరియెన్స్ పొందేందుకు ప్రజలు చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నారు. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేదని లాల్ తెలిపారు.
హిందీ తో పాటు విదేశీ భాషలకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకి చెందిన ఓటిటి హక్కులను జీ 5 దక్కించుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ శాటిలైట్ రేట్స్ ని “జీ సినిమా” సొంతం చేసుకోగా.. సౌత్ సినిమా శాటిలైట్ రేట్స్ ని “స్టార్ గ్రూప్స్” చేజిక్కించుకుంది. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ కోసం 2022 జవవరి 7 వరకు ఎదురు చూడాల్సిందే.