జాగర్ల మూడి రాధాకృష్ణ ( క్రిష్ ) ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించాడు. అందరూ కరోనా కారణంగా షూటింగ్ చేయాలంటే భయపడి బయటకి రాని సమయంలో క్రిష్ తన యూనిట్ తో వికారాబాద్ ప్రాంతంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందుకు కలగకుండా 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో సినిమాని కంప్లీట్ చేసుకొని వచ్చాడు. క్రిష్ ప్లాన్ కి అందరూ షాకయ్యారు కూడా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని థియోటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే 2021 సంక్రాంతి బరిలో దింపాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట.
కాగా క్రిష్ ఈ సినిమాని ఒక విభిన్నమైన టైటిల్ ని అనుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. కొండపొలం అన్న టైటిల్ సినిమాకి కరెక్ట్ యాప్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ కాబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాని రాజీవ్ రెడ్డి – జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్ విషయంలో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయంటున్నారు.
అసలు క్రిష్ కి టైటిల్స్ ఐడియా ఎలా వస్తుందని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారట. గమ్యం, వేదం, కంచె .. ఇలా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో బాగా బజ్ క్రియేటయ్యేలా క్రిష్ ప్లాన్ చేస్తుంటాడు. గతంలో కంచె సినిమా విషయంలో ఆ సినిమాలో వరుణ్ తేజ్ గెటప్ విషయంలో కూడా ఇలాంటి చర్చలే సాగాయి. ఇప్పుడు కూడా కొండపొలం గనక టైటిల్ గా వైష్ణవ్ తేజ్ సినిమాకి ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ గెటప్ కూడా డిఫ్రెంట్ గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహాపడాల్సిన అవసరం లేదంటున్నారు. చూడాలి మరి త్వరలో ఈ సినిమా టైటిల్ అండ్ వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి బజ్ క్రియేటవుతుందో.