Collections RRR : ఆర్ఆర్ఆర్ నైజాం కలెక్షన్ లెక్కల్లో నిజం ఎంత..100 కోట్లు కాదా..?

Collection RRR : ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయినప్పటి నుండి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.రికార్డుల సునామి సృష్ఠుస్తోంది. తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. మిగిలిన భాషల్లో కూడా డీసెంట్ అనిపిస్తుంది. ఇప్పటికే రూ.1030 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది ఇది వాస్తవం. బాలీవుడ్ లోనూ మంచి కలెక్షన్స్ అయితే సంపాదించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను మంచి లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అయితే బాహుబలి అంతిమ కలెక్షన్లను ఈ సినిమా దాటదని కన్ఫర్మ్ అయిపోయింది.

ఇక తెలుగురాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ ఒక్క నైజాం లోనే 100కోట్లు వసూలు చేసిందని ఆ మధ్య దిల్ రాజు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చాడు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి. అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవట నైజాం లో ఆర్ఆర్ఆర్ 100కోట్లు వసూళ్లు చేయలేదట కేవలం 87కోట్లు మాత్రమే వసూళ్లు జరిగాయట.ఇక ఈ ముక్క చెప్పింది ఎవరో కాదు అక్కడి డిస్ట్రిబ్యూటర్లే. ఆ రూ.100 కోట్ల పైన షేర్ మాట ఏంటి? అంటే జీఎస్టీ కాకుండా వచ్చిన నెట్ ను షేర్ గా ప్రచారం చేస్తున్నారట.

అదన్నమాట విషయం.అయితే 87కోట్లు వసూలు చేయడం కూడా మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో మాత్రమే కాదు ఇటీవల విడుదలైన అన్ని సినిమాల విషయంలో కూడా ఇలాంటి వాదనే వినిపిస్తుంది. జీఎస్టీ కాకుండా షేర్ చేసుకోవడంతో సినిమా ఫలానా సినిమా రికార్డులు కొట్టేసింది అని అంతా అనుకుంటున్నారు.