ఎన్టీఆర్ తో రజినీ కాంత్ కు సంబంధమేంటి?

తెలుగు ప్రజలంతా ముద్దుగా అన్నా అని పిలుచుకునే అలనాటి స్టార్ హీరో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 28న తేదీన అన్నగారి శత జయంతి ఉత్సవాలు. అంటే 100వ పుట్టిన రోజు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఊరు వాడా ఏకం చేసి రాష్ట్రమంతా ఎన్టీఆర్ పేరే వినిపించేలా చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు విజయవాడలో (మే 28) ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిజానికి ఎంతో మంది ఎన్టీఆర్ తో కలిసి నటించిన వారు కూడా ఉన్నారు. రజినీని పిలవడానికి ఓ ప్రత్యేక కారణం అంది. అదేంటంటే…!

రజినీ కాంత్ ఇంట్లో నిలువెత్తు ఎన్టీఆర్ చిత్ర పటం ఉండడమే కాకుండా సినీ రంగంలో ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన దారుల్లోనే రజినీ నడుస్తున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దీంతో టీడీపీ నుంచి ఆహ్వానం అందగానే రజినీ కాంత్ విజయవాడలో వాలిపోయారు. రజినీ, ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమాలు రెండే రెండు.. అందులో ఒకటి టైగర్ అనే తెలుగు చిత్రం, రెండోది మణ్ణన్ వాణి (నిండు మనిషి) అనే తమిళ సినిమా.

ఈ రెండు సినిమాలతోనే వీరిద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. నిర్మాతలకు గౌరవం ఇవ్వడం వంటి విషయాలన్నీ రజినీ కాంత్ అన్నగారి దగ్గరే నేర్చుకున్నారట. ఈరోజు సభలో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. ముందుగా రజినీ విజయవాడకు చేరుకున్న వెంటనే బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. విజయవాడలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి విశ్రాంతికి ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు బాలయ్యతో కలిసి రజినీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ తేనీటి విందు తీసుకున్నాక.. సాయంత్రం 6 గంటలకు అంతా కలిసి విజయవాడలో నిర్వహించే అన్నగారి శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు.