యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ అయ్యింది. అయితే భారీ డిజాస్టర్ అయిన కూడా ఏకంగా 400 కోట్ల గ్రాస్ ని ఆదిపురుష్ మూవీ కలెక్ట్ చేయడం విశేషం. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడం, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించడం కూడా ఆదిపురుష్ సినిమాపై బజ్ క్రియేట్ కావడానికి కారణం అయ్యింది.
ఆదిపురుష్ మూవీ రిలీజ్ తర్వాత విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. రామాయణంలోని పాత్రలని, కథ విధానం పూర్తిగా వక్రీకరించారనే విమర్శలు వచ్చాయి. హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆదిపురుష్ మూవీపై వ్యతిరేకంగా నిరసన తెలియజేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చంద్రయాన్ 3 రాకెట్ లాంచింగ్ ని ఇస్రో చేసింది.
విజయవంతంగా భూ చంద్రుని కక్ష్యలోకి దీనిని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో 615 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగానికి ఆదిపురుష్ ని లింక్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా కోసం చంద్రయాన్ 3 కంటే ఎక్కువగా ఖర్చు చేసారని అయిన కూడా సినిమా డిజాస్టర్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో మరోసారి ఆదిపురుష్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఆదిపురుష్ మూవీకి 300 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ లెక్కల ప్రకారం కూడా 400 కోట్లు దాటలేదు. అయితే క్వాలిటీ పరంగా చూసుకుంటే గ్రాఫిక్స్ పరంగా కాని, కంటెంట్ పరంగా కాని ఆదిపురుష్ ప్రేక్షకులని కన్విన్స్ చేయలేకపోయిందనే ఉద్దేశ్యంతో ఇలా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమాని నార్త్ ఇండియన్ ఆడియన్స్ అంత ఈజీగా మరిచిపోయేలా లేరని ఈ చంద్రయాన్ 2తో పోల్చడం ద్వారా అర్ధమవుతోంది. అయితే ఈ సినిమా కారణంగా ప్రభాస్ ఇమేజ్ కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అందుకే ఇప్పుడు సలార్ మూవీపై మళ్ళీ హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.