ఆది పురుష్ టీమ్ కళ్ళు తెరవండి..అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్..?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇకపోతే ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్, ఆది పురుష్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాల అన్నింటికీ సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నిత్యం వార్తల్లో ఉంటున్నాయి.

కానీ ఒక ఆది పురుష్ సినిమా నుంచి మాత్రం ఇంతవరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. చాలా కాలం నుంచి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆది పురుష్ సినిమాలో రాముడుగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి అయి కూడా నెలలు గడుస్తున్నా కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. అయితే ఇప్పటివరకు ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని ఎదురు చూసిన అభిమానులు ఓపిక నశించి సోషల్ మీడియాలో వార్ ప్రకటించారు.

#WakeUpTeamADIPURUSH ఆది పురుష్ టీం కళ్లు తెరవండి అన్న హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. నీ బాంచన్ అయిత జరా ఆది పురుష అప్డేట్ ఇవ్వరాదన్నా.. ఓం రౌత్ భయ్యా నిద్ర పోయింది చాలు ఇంక ముందు అప్డేట్ ఇవ్వు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ మీమ్స్ పై ఆది పురుష్ చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. మరి అభిమానుల కోరిక మేరకు ఆది పురుష్ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ను విడుదల చేస్తారేమో చూడాలి మరి.