Karthika Deepam: కార్తీక్, దీప లేని కార్తీకదీపం సీరియల్ మాకెందుకు.. ఫస్ట్ ఆపేయండి!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అద్భుతమైన రేటింగ్ సంపాదించుకొని విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ గత కొన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతోంది. ఇక ఈ సీరియల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వంటలక్క డాక్టర్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే కథ మారడంతో ఈ సీరియల్ లో ప్రస్తుతం వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను తీసేశారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ దీప లేకపోవడంతో ఈ కార్యక్రమానికి రేటింగ్ కాస్తా తగ్గిందని చెప్పాలి. అలాగే ఈ సీరియల్ పెద్దగా ప్రేక్షకులను కూడా సందడి చేయలేకపోవడంతో ఎంతో మంది అభిమానులు పెద్దఎత్తున ఈ సీరియల్ పై పలు డిమాండ్లను వ్యక్తపరుస్తున్నారు. సీరియల్ కు ఎంతో కీలకంగా ఉన్నటువంటి దీప కార్తీక్ పాత్రలను చంపేసి సీరియల్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ సాగదీయడంతో ఎంతో బోర్ కొడుతోంది.

ఈ క్రమంలోనే నెటిజన్లు కార్తీక్ దీపలేని కార్తీకదీపం సీరియల్ మా కొద్దు..వెంటనే ఈ సీరియల్ ఆపేయండి అంటూ పెద్ద ఎత్తున అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.లేదంటే తిరిగి కార్తీక దీప పాత్రలను తీసుకురండి అంటూ అభిమానులు ఈ సీరియల్ పై భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకుల డిమాండ్లను చూస్తుంటే ఈ సీరియల్ కి కార్తీకదీప పాత్రలు ఎంత కీలకంగా మారాయని అర్థమవుతోంది.