Pranitha Subhash: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే చర్చ. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించడం చెప్పుకోదగిన విషయం. అస్సాం ప్రభుత్వమైతే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయం. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసి కాసుల వర్షం కురిపిస్తోంది.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి సినీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతా కాకుండా ఈ చిత్రాన్ని ప్రధాని మోదీ కూడా చూడాలని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు జమ్మూలోనైతే ఈ సినిమా ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. వాస్తవాలను వక్రీకరించి చూపించారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా కొన్ని చోట్ల వివాదాలు చెలరేగినా, చాలా చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాకే రావడం విశేషం.
ఇకపోతే ఈ చిత్రాన్ని సినీ సెలబ్రెటీలు సైతం చూసి తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ విషయానికొస్తే అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత కూడా ఇటీవలే తన భర్తతో కలిసి ఈ సినిమాను చూశారు. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రణీత చెప్పారు. వీలైతే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని ఆమె కోరారు. అంతే కాకుండా ఈ మూవీ పూర్తయ్యేసరికి తానూ, తన భర్త ఏడ్చేశామని ఆమె భావోద్వేగం చెందారు. ఇదిలా ఉండగా ప్రణీత ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రం. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సహా పలువురు నేతలు ఈ చిత్రాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ మూవీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అస్సాం(Assam) గవర్నమెంట్ అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. విమర్శకులు ప్రశంసలు సైతం అందుకుంటుంది ఈ మూవీ. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.67.35 కోట్ల కలెక్షన్లు సాధించి.. 100 ఓట్ల దిశగా పరుగులు పెడుతుంది. కాగా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని నెటిజన్లు తెగ సెర్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ 5 సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండ చూడాలంటూ కోరుతున్నారు.