జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వార్ 2 టీజర్‌పై ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా కనిపిస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలయికతో టీజర్ యాక్షన్ పరంగా రిచ్‌గానే ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. టీజర్‌లోని మూడ్, విజువల్స్ ఆకట్టుకున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్లో హైప్ ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో బిజినెస్ సీన్ మారుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు మార్కెట్‌పై నిర్మాతలకు ప్రారంభ దశలో మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ హైప్ కారణంగా రూ.75 కోట్ల వరకు డిమాండ్ చేశారు. నిర్మాతలు మాత్రం 100 కోట్లకు కోట్ చేసినట్టు టాక్. కానీ టీజర్ తర్వాత ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ముందుగా ఉన్న ఆసక్తి తగ్గించుకొని, కేవలం 50 కోట్లలోనే డీల్ క్లోజ్ చేస్తేనే తీసుకుంటామని తెలిపినట్టు సమాచారం. దీంతో నిర్మాతలు కొంత అవాక్కయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు బిజినెస్ విషయంలో ఈ ఆలోచనల మార్పుకు కారణం కథకు లోకల్ కనెక్ట్ లేకపోవడమే అని భావిస్తున్నారు. బాలీవుడ్ టేకింగ్ ఉండటం, యష్ రాజ్ యాక్షన్ యూనివర్స్ కథల ఫార్మాటే కొనసాగుతుండటం వల్ల తెలుగు ఆడియన్స్‌లో ఒరిజినాలిటీపై డౌట్ వచ్చేసింది. ఎన్టీఆర్ స్టైల్, డైలాగ్ మానరిజంస్ తెలుగులో కనిపించకపోవడం కూడా ఈ స్పందనపై ప్రభావం చూపించినట్టు అంటున్నారు. ఇక టీజర్ టాక్ కన్నా ఫైనల్ సినిమా కంటెంట్ మీదే ఫలితం ఆధారపడనుంది.