చేతిలో సెన్సేషనల్ ఆఫర్ తో “వాల్తేరు వీరయ్య” దర్శకుడు బాబీ.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర మాసివ్ హిట్ “వాల్తేరు వీరయ్య” సినిమాతో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బాబీ అయితే నెక్స్ట్ లెవెల్లో హిట్ ని అందుకొని స్టార్ దర్శకుడు అయిపోయాడు. అయితే ఈ సినిమా హిట్ తోనే బాబీ హిట్ దర్శకుడు అయ్యాడని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అయ్యిందని చెప్పక తప్పదు.

కాగా ఇలాంటి భారీ హిట్ తర్వాత అయితే ఈ దర్శకునికి మరో సినిమా లేదా అంటూ చాలా మంది కూడా కామెంట్ చేసాడు. అయితే దీనికి సెన్సేషనల్ లెవెల్లో ఆన్సర్ ఇప్పుడు దక్కింది. కాగా బాబీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తాను అందుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇది మాత్రం అసలు ఎవరూ ఊహించని అంశం అని చెప్పాలి. మరి మెగాస్టార్ తర్వాత ఈ దర్సకుడు నుంచి ఎలాంటి సినిమా ఉంటుంది అనుకునే సమయంలో ఈ న్యూస్ కేజ్రీగా మారింది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యాంక్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. అలాగే ఇప్పటికే రజిని అయితే మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ అయ్యాక వీరి సినిమా ఉంటుందా లేక మధ్యలోనే ఉంటుందా అనేది వేచి చూడాలి.