టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత నాగవంశీ ప్రస్తుతం వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాత సూర్య నటిస్తున్న రెట్రో సినిమా హక్కులను 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఒకింత రిస్క్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రెట్రో సినిమా హిట్టై మంచి కలెక్షన్లు సాధిస్తే నిర్మాత నాగవంశీ అంత అదృష్టవంతుడు అయితే ఎవరూ ఉండరని చెప్పవచ్చు. లియో, దేవర సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి ఆ సినిమాలతో మంచి లాభాలను సొంతం చేసుకున్న నాగవంశీ ఆ సినిమాల హీరోలు, నిర్మాతలతో ఉన్న అనుబంధం వల్ల మాత్రమే ఆ సినిమాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది.
సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబో మూవీకి మంచి టాక్ వస్తే 9 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించడం మరీ భారీ టాస్క్ అయితే కాదు. సూర్య వెంకీ అట్లూరి కాంబో మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్య మార్కెట్ గత కొంతకాలంగా తగ్గుతోంది. సూర్య ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు.
ఈ మధ్య కాలంలో సూర్య సక్సెస్ రేట్ తగ్గడంతో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.