Allu Arjun: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి అందులో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
గత కొద్దిరోజులుగా బాలకృష్ణ నటిస్తున్న వరుస సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సైతం అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందంపై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం బాలయ్య సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా నిర్మాత నాగ వంశీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల బొకే పంపించారు. ఇక ఈ పూల బొకేను నాగ వంశి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మా సినిమా మంచి సక్సెస్ అయినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ పూల ఒకే పంపించిన అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు అంటూ నాగవంశీ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.
ఈ విధంగా అల్లు అర్జున్ బాలకృష్ణ సినిమాకు ప్రశంసలు కురిపిస్తూ పూల బొకే పంపించడంతో పరోక్షంగా రామ్ చరణ్ సినిమా బాలేదని, చెప్పకనే చెప్పేశారు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమా చూశారా లేదా అన్నది తెలియదు కానీ రామ్ చరణ్ సినిమా గురించి ఏమాత్రం స్పందించకుండా బాలయ్య సినిమా సక్సెస్ అవ్వడంతో ఫ్లవర్ బొకే పంపించడంతో రామ్ చరణ్ కు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో నాగ వంశీ నిర్మించబోతున్నారని తెలుస్తోంది.