‘విశ్వంభర’: త్రిష రెమ్యునరేషన్ ఆ రేంజ్‌లో.?

ఆ మధ్య చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశారు. ఆ సినిమా కోసం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది నయనతార. ఔను మరి, నయనతారకి వున్న డిమాండ్ అలాంటిది. తెలుగులో నయనతారకి అంత సీన్ లేదు. కానీ, తమిళనాట ఆమె లేడీ సూపర్ స్టార్.!

నయనతారతో పోల్చితే, త్రిషకి తమిళనాట కంటే, తెలుగునాట కాస్త బెటర్ క్రేజ్ వున్నమాట వాస్తవం. అయితే, త్రిష కూడా ఈ మధ్య తెలుగులో సక్సెస్‌లు కొట్టింది లేదు.

మామూలుగా అయితే, త్రిష రెమ్యునరేషన్ తెలుగులో నామినల్‌గానే వుంటుంది. కానీ, ‘విశ్వంభర’ సినిమాకి మాత్రం రికార్డు స్థాయిలో ఆమె రెమ్యునరేషన్ అందుకుంటోందిట. అదెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

త్రిష పేరుని సజెస్ట్ చేసింది స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గనుక, నిర్మాతలు, త్రిష అడిగినంత ఇచ్చి ఆమెని ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ రెమ్యునరేషన్ ఫిగర్ విన్నాక, త్రిష కూడా ఆశ్చర్యపోయిందట.

‘ఆచార్య’ సినిమా నుంచి తొలగించబడ్డ త్రిష, తనకు చిరంజీవి సినిమాతోనే మళ్ళీ ఆ గౌరవం దక్కడం పట్ల చాలా చాలా హ్యాపీగా వుందిట. నయనతారతో వచ్చిన చిక్కేంటంటే, ఆమె సినిమా ప్రమోషన్లకు రాదు. త్రిషతో ఆ సమస్య వుండదు.

అన్నట్టు, ‘విశ్వంభర’ సినిమాలో త్రిష అనగానే, ఈ ప్రాజెక్టుకి కాస్తంత అదనపు గ్లామర్ అయితే యాడ్ అయ్యిందని చిత్ర యూనిట్ వర్గాలే చెబుతున్నాయి.